Saturday, 28 December 2019

Telugu


         శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్త రమణ
     కథ , ధారావాహిక, నాటక రచయిత్రి , టీవీ ఇంటర్వ్యూయర్, రేడియో గ్రేడెడ్ ఆర్టిస్ట్
ప్రధాన కార్యదర్శి, శ్రీ దత్త  సాంస్కృతిక సంస్థ
 vasuramana@gmail.com/sridattaorg@gmail.com
                                                


12 .12 .1967 పుట్టి, పెరిగింది, పోస్ట్ గ్రాడుయేషన్ అంతా హైదరాబాద్ లో,తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లో డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం.
హైదరాబాద్ లో కాన్వెంట్లలోనే  చదువుకున్నా, చిన్నపట్నుంచి తెలుగు భాష పట్ల మమకారం కలుగ చేసినది పితామహులు కీ.శే. శ్రీ మల్యాల వియ్యరాజుగారు (19.12.1901-31.12.1990),మల్లాo గ్రామం, పిఠాపురం మండలము,తూర్పుగోదావరి జిల్లా కరణం, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, పండితులు, పురాణ ప్రవచకులు,ఆయుర్వేద వైద్యులు ,రంగస్థల, సినీనటులు. పద్య, పౌరాణిక నటులు,దర్శకులు.

తల్లిగారైన కీ.శే, శ్రీమతి మల్యాల హైమావతి గారు (17.11.1942-03.09.1997) హైదరాబాద్ లో ప్రముఖ రేడియో కళాకారిణి, అనేక నాటక,సంగీత కార్యక్రమాలతో పాల్గొన్నారు, వారు చిన్నతనం నుంచే  భగవద్గీత పఠనంలో కాకినాడలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.
తండ్రి గారు కీ.శే శ్రీ ఎం.వీ. రామారావుగారు (11.8.1937-11.02.2011) 1955 నుంచి హైదరాబాద్ లో  స్థిరనివాసం ఏర్పరుచుకుని ఎలక్ట్రిసిటీబోర్డు DE గా, 60 ఏళ్లు రంగస్థల దర్శకుడుగా, నటుడిగా, నాటకప్రయోక్తగా, నాటక రచయితగా, న్యాయ నిర్ణేతగా, రేడియో, టీవీ, సిని కళాకారులుగా కళామ తల్లి సేవలో నాటకరంగానికి అంకితమైన ప్రతిభాశాలి. నాటకాలు,నాటికలు, 100 కు పైగా సినిమాలు, 45 ఏళ్లు రేడియోలో గ్రేడ్ ఆర్టిస్టుగా, 35 ఏళ్ళు పైగా దూరదర్శన్లో గ్రేడ్ ఆర్టిస్టుగా మొత్తం మీద సుమారు 1000 నాటక/నాటికలు, రంగస్థలంలో ప్రదర్శించి ఎన్నెన్నో పురస్కారాలు పొందిన విశిష్ట నటులు. తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత.

భర్త శ్రీ కామరాజుగడ్డ రమణ గారు ఐటీ సహాయ మేనేజర్ గా పదవి విరమణ చేసి, శ్రీ దత్త సంస్కృతిక సంస్థ అధ్యక్షులుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. జీవన మార్గదర్శకులు, సహాయ సహకారాలు అందిస్తూ తోడునీడగా వెన్నంటి నిలుస్తున్నారు. ఇద్దరు కుమారులు శ్రీ కె.కార్తీక్ B.Tech,MS, మరియు శ్రీ కె.అనిరుద్ B.Tech,MS అమెరికాలో ఉద్యోగాల లో ఉన్నారు.

ప్రచురణలు:

2006లో  తొలి కథ " అరుగు" తో మొదలు ప్రముఖ తెలుగు పత్రికలలో 150కి  పైగా కధలు, రెండు ధారావాహికలు సంధ్యారాగం,లక్ష్యం, ఒక తమిళ అనువాద  కధ, ఒక ఆంగ్ల అనువాద కధల పుస్తకం వెరసి ఏడు పుస్తకాలుగా కధల సంకలనాలు, నవలలు ప్రచురింప బడ్డాయి.
v  ఒంటరి నక్షత్రం       -  2009  చిన్న కధల సంకలనం
v  వెలుగు రేఖలు       -  2011  చిన్న కధల సంకలనం
v  స్వాగతం                -  2012  చిన్న కధల సంకలనం
v  అంతరాలు             -  2016  చిన్న కధల సంకలనం
v  సంధ్యారాగం          -  2010  ధారావాహిక నవల
v  లక్ష్యం                  -  2013  ధారావాహిక నవల
v  ట్రిబ్యూట్               -  2015 ఆంగ్ల అనువాద కధల సంకలనం.

 బహుమతులు :

Ø  కంటిరెప్ప కధకు 1.8.2008 స్వాతి వార పత్రిక కధల పోటీలలో  Rs.5,000/- నగదు బహుమానం.
Ø  పరివర్తన కధకు 29.1.2014 నవ్య వార పత్రిక కధల పోటీలలో Rs.5,000/- నగదు బహుమానం.
Ø  నివాళి కధకు వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికావారు నిర్వహిచిన తెలుగు రచయిత్రుల అంతర్జాతీయ పోటీలో Rs.5,000 /- బహుమానం, 21.11.2010 నాడు ఆంధ్ర ప్రభలో ప్రచురణ. త్యాగరాయ గాన సభలో సత్కారం.
Ø  ఏడు అడుగులు  కథకు 1.11.2015 ఈనాడు  ఆదివారం పత్రిక పోటీలో మూడవ కన్సోలేషన బహుమతి.
Ø  నిర్బయ కధకి 1.10.2015 భూమిక  కదల పోటీలో Rs.3,000/- బహుమానం,పుచ్చలపల్లి సుందరయ్య హాల్ లో  సత్కారం.
Ø  సాన్నిహిత్యంకథకు 26.8.2016 స్వాతి వార పత్రిక సరసమైన కధల పోటీలో Rs 10,000/- నగదు బహుమానం.
Ø  మేలు కొలువు  కధకు 7.10.2016 స్వాతి వార  పత్రిక హాస్య కథల పోటీలో Rs.10,000/- నగదు బహుమానం.
Ø  అద్భుతమైన వరం కథకు 27.4.2018 స్వాతి వార పత్రిక సరసమైన కధల పోటీలో Rs 10,000/- నగదు బహుమానం.
Ø  విజయతీరం కథ 1.7.2017 నెలవంక పత్రిక ప్రచురణ. త్యాగరాయ గానసభ లో 25.02.2018 కలహంస’ పురస్కారంతో సత్కారం.
Ø   వెలుగు రేఖలుకదల సంకలనం ఆరాధన సంస్థ వారు నిర్వహించిన పోటీలో రెండవ బహుమతి ,త్యాగ రాయగానసభలో సత్కారం. 
Ø  తన దాకా వస్తే కధ తమిళంలోకి అనువాదమై, “మంజరితమిళ పత్రికలో  చుజాద్రితినంకధ పేరుతో 2013లో  ప్రచురింపబడింది.
Ø   ఎనిమిదో అడుగు కధ మహిళా రచయిత్రులు  ఎయిడ్స్ మీద సంకలనపరిచిన "ఆశాదీపం" పుస్తకంలో ప్రచురణ.
Ø  ఉగాది పురస్కారంతో సచ్చితానంద కళా పీఠం వారు 18.3.2018 త్యాగరాయ గానసభ లో సత్కారం.
Ø  అభిషేకం కధకు  యద్దనపూడి సులోచన రాణి  కథల పోటిలలో ప్రత్యేక బహుమానం. 1.7.2019  లో  సంచిక వెబ్ సైట్ లో ప్రచురణ.
Ø   లేఖిని సంస్థ వారిచే త్యాగరాయ  గాన సభలో14.8.2019  నాడు యద్దనపూడి సులోచనారాణి స్మారక పురస్కార’ ప్రధానం,సత్కారం.
Ø  తల్లి వేరుకధకు  షోయబుల్లాఖాన్ కథల పోటిలలో ప్రత్యేక హుమతి.  21.7.2019 నాడు నవ తెలంగాణ పత్రికలో ప్రచురణ .
Ø  ‘ఉత్తమ రచయిత్రి’గా “రచనా శిల్పి” బిరుదు తో  వైసర్ మూర్తి సంస్థ వారు 25.11.2019 నాడు త్యాగ రాయగానసభలో సత్కారం.


రేడియో: -


ఆకాశవాణిలో హైదరాబాద్ లో "బి హైగ్రేడ్ ఆర్టిస్ట్ గా, రచయిత్రి గా  దాదాపు 40 ఏళ్ళుగా  వందలాది కార్యక్రమాలు చేయడం జరిగింది.
Ø  నాటకాలు/నాటికలు.
Ø  పిల్లల కధలు, నాటికలు.
Ø  కధానికలు.
Ø  చర్చలు / రూపకాలు.
Ø  ప్రముఖ వ్యక్తులు మరియు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై వ్రాసిన నాటికలు మరియు రూపకాలు.
Ø  తెలుగు సాహిత్యం ,సామాజిక నాటకాలు, స్త్రేల కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు,ఇంటర్వ్యూలు, మానవ వికాసం సైన్స్ సీరియల్స్
దూరదర్శన్ : -
1986 నుంచి హైదరాబాద్ టీవీ తో గత 35 సంవత్యరాలుగా పరిచయకర్తగా , కంపీరర్ గా, వందలాది కార్యక్రమాలు నిర్వహణ.
Ø  సామాజీక , మహిళా ఆధారిత కార్యక్రమాలు
Ø  వారం అతిధి కార్యక్రమాలు
Ø  జాబులు జవాబులు - దూరదర్శన్ డైరెక్టర్ తో లైవ్ కార్యక్రమం  
Ø  న్యాయ సలహాలు లాయర్స్ లైవ్ ప్రోగ్రామ్స్, ప్రముఖ న్యాయవాదులతో వివిధ సమస్యలు గురించి చర్చ , ఫోన్ ఇన్  కార్యక్రమం
Ø  సాహిత్య కార్యక్రమాలలో సాహితీ ప్రముఖులతో  ఇంటర్వ్యూలు.
Ø  టెలి స్కూల్ కార్యక్రమాలు, వివిధ టాక్ షోస్
Ø  ఆరోగ్య కార్యక్రమాలు
Ø  డాక్యూమెంటరీలు
Ø  రచయిత్రిగా కనువిప్పుమరియు కలిసిన మనసులురెండు నాటకాలు దూరదర్శన్ లో ఒక గంట ప్లే గా ప్రసారమైనవి.
Ø   స్క్రిప్ట్ రైటర్ గా ఇతర ప్రతేక్య కార్యక్రమాలు
Ø   సాహిత్య కార్యక్రమాలలో పరిచయం చేసిన సాహితీ  ప్రముఖులలో కొందరు:
డా.oడూరి రామకృష్ణమాచార్యులు,డా.అక్కిరాజు రమాపతి రావు, డా.కొలకలూరి ఇనాక్, డా.నాగఫణి శర్మ, డా.రవ్వ శ్రీహరి, డా.శ్రీమతి రామలక్ష్మి IFS,   డా.నాయని కృష్ణ కుమారి,డా.సి ఆనంద రామం, డా.అనంత్ లక్ష్మి, డా.కె  బి లక్ష్మి. డా.జి వరలక్ష్మి,  డా.మునిపల్లి రాజు, శ్రీ శ్రీ రమణ, డా.శారదా అశోకవర్ధన్,        డా. బి కే  ప్రసాద్,డా.రాళ్లబండి కవిత ప్రసాద్,డా.వేదగిరి రాంబాబు, డా.తాడేపల్లి పతంజలి, డా.ప్రభల సుబ్రమణ్య శర్మ,డా.పెద్దమఠo రాచ వీర దేవర, శ్రీ విహారి,           డా.చాడ సుబ్రమణ్య చైనులు,డా.నందుల గోపాల కృష్ణ, డా.దరువురి వీరయ్య,శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు, డా.వేదుల సత్యనారాయణ,శ్రీ కాశినాధుని నాగేశ్వరరావు,   డా.ఎన్ స్ రాజు,, డా కల్వకుంట్ల నరసింహ మూర్తి, డా.మొవ్వ వృషాద్రి  శ్రీ శిరోమణి శర్మ,శ్రీ ఉప్పులూరి మల్లిఖార్జున శర్మ,శ్రీ జిత్ మోహన్ మిత్ర, డా.వద్దే కృష్ణ,    డా. రావూరి అనంత పద్మనాభరావు, డా.పోతుకుచి సాంబశివరావు, డా.పొరంకి దక్షిణ మూర్తి, డా.బీమశoకరం, డా.నరశింహ దేవర ఉమా మహేశ్వర శాస్త్రి,  డా.సునీత కృష్ణన్, డా.కొడుకుల జగనధారావు, డా.జి. సురేష్ బాబు మరియు అనేక ప్రముఖ సాహితీవేత్తలు  
ఇతరం :
Ø  1977 లో హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలలో "కన్యాశుల్కం" నాటకంలో బాల కళాకారిణిగా పాత్ర పోషణ.ప్రశంసా పత్రం.
Ø  సామాజిక,సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో గౌరవ అతిధిగా పాల్గొనడం,తెలుగు సంస్కృతి మరియు సాహిత్యం అభివృద్ధికి విశేష కృషి.
Ø  శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ యొక్క స్థాపక ప్రధాన కార్యదర్శిగా ఏటేటా అనేక పురస్కారాలు ప్రధానం చేయడం ,సాహిత్య, సాంస్కృతిక,సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహిoచడం జరుగుతోంది.


బ్లాగ్   

             http://sridattaorg.blogspot.com
పుస్తకాలు  Books    :


All my books are available in leading book shops and online as below 

http://kinige.com/author/K.+Vasavadatta+Ramana

             http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=4014